ఇండోనేసియా తూర్పు జావా రాష్ట్రంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. గంజుక్ జిల్లా సెలోపురో గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు చిన్నారులు సహా 9 మంది ఆచూకీ గల్లంతైంది. వారికోసం సహాయక చర్యలను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పనిముట్లతో సహాయక సిబ్బంది.. మట్టిని తవ్వుతున్నారని చెప్పారు.
ప్రకృతి బీభత్సంలో 10కి చేరిన మృతులు - ఇండోనేసియా తాజా వార్తలు
ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. 9 మంది ఆచూకీ గల్లంతైంది. వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రకృతి బీభత్సంలో 10కి చేరిన మృతుల సంఖ్య
సైనికులు, పోలీసులు, వలంటీర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈమేరకు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గంజుక్ గ్రామంలో ఆదివారం 8 ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. 21మంది వరదలో చిక్కుకోగా.. ఇద్దరిని కాపాడారు. 14 మందికి గాయాలయ్యాయి. సోమవారం 10 మృతదేహాలు.. బురదలో లభ్యమయ్యాయి.
ఇదీ చదవండి:టెక్సాస్‌లో పవర్ కట్- విమానాలు బంద్