తెలంగాణ

telangana

ETV Bharat / international

విరిగిపడిన కొండచరియలు- ఇద్దరు మృతి

ఇండోనేసియాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. 16మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సహయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

Rain sets off Indonesia landslide; 2 dead, 16 missing
కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మృతి, 16మంది గల్లంతు

By

Published : Feb 15, 2021, 12:40 PM IST

ఇండోనేసియాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తూర్పు జావా రాష్ట్రం గంజుక్ జిల్లా సెలోపురో గ్రామంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ఆచూకీ గల్లంతైనట్లు విపత్తు నిర్వాహక అధికారులు తెలిపారు.

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గంజుక్​ గ్రామంలో ఆదివారం 8ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. 21మంది వరదలో చిక్కుకోగా.. పలువురిని కాపాడినట్లు తెలిపారు అధికారులు. రెండు మృతదేహాలు లభ్యమవగా.. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :అమెరికాను బెంబేలెత్తిస్తున్న హిమపాతం

ABOUT THE AUTHOR

...view details