తెలంగాణ

telangana

ETV Bharat / international

జమ్ముకశ్మీర్ విభజన​పై అడ్డు చెప్పాలని ఐరాసకు పాక్ లేఖ - Pakistan Foreign Minister Shah Mahmood Qureshi has written a letter to the UN Secretary General

జమ్ముకశ్మీర్​ను విభజిస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహ్మద్ ఖురేషి. ఈ లేఖను అక్టోబర్ 31న రాసినట్లు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ విభజన​పై అడ్డు చెప్పాలని ఐరాసకు పాక్ లేఖ

By

Published : Nov 19, 2019, 1:09 PM IST

జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ.. భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించాలని ఐరాస భద్రతా మండలిని ఆశ్రయించారు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​కు లేఖ రాశారు.

ఇదే ఏడాది ఆగస్టు 1,6,13, 26, సెప్టెంబర్​ 16వ తేదీల్లో రాసిన ఉత్తరాలకు ఈ లేఖను కొనసాగింపుగా పేర్కొన్న ఆయన.. కశ్మీర్​లో తాజా పరిస్థితులపైనా ఐరాసకు నివేదించారు. చట్ట విరుద్ధ విభజనతో భారత్​-పాక్​ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులను మరింత పెరిగాయని తెలిపారు. ఇరుదేశాల్లోనూ ఐరాసకు చెందిన సైనిక పర్యవేక్షణ బృందాలను మరింత బలోపేతం చేయాలని లేఖలో పేర్కొన్నారు ఖురేషి.

ఇదీ చూడండి: ఉమ్మడి పౌరస్మృతిపై ముందుకేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details