తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ కుర్చీ ఖాళీ

ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ సమావేశానికి సుష్మాస్వరాజ్ హాజరైన కారణంగానే తాను రాలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు.

సుష్మ కారణంగానే ఇస్లామిక్ దేశాల సహకారానికి రాలేదన్న ఖురేషి

By

Published : Mar 1, 2019, 1:39 PM IST

Updated : Mar 1, 2019, 7:54 PM IST

సుష్మ కారణంగానే ఇస్లామిక్ దేశాల సహకారానికి రాలేదన్న ఖురేషి

ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ-ఓఐసీసమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి హాజరు కాలేదు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ హాజరు కావడమే దీనికి కారణంగా తెలిపారు. యూఏఈలో రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సమావేశాలకు సుష్మా ప్రత్యేక అతిథి.

ఖురేషి కుర్చీ ఇలా ఖాళీగా కనిపించింది

"పలు ఇబ్బందికర పరిస్థితులలో యూఏఈ పాక్​కు బాసటగా నిలిచింది. కానీభారత విదేశాంగ మంత్రిని ఆహ్వానించడం మాత్రం సరికాదు" అన్నారు ఖురేషి. భారత్​ను ఆహ్వానించేటప్పుడు యూఏఈ పాక్​ను సంప్రదించలేదని ఖురేషీ పేర్కొన్నారు.

పరిశీలక హోదా వద్దు...

పాకిస్థాన్​ విదేశాంగ శాఖఅధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్​కు పరిశీలక హోదాను ఇవ్వడాన్ని వీరు వ్యతిరేకించనున్నారు.

Last Updated : Mar 1, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details