తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్'​పై పంతం వీడని పాక్​.. ఐరాసకు మరోమారు లేఖ - ఐక్యరాజ్యసమితి

కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, భద్రత మండలి అధ్యక్షుడికి మరోమారు లేఖ రాసింది పాకిస్థాన్​. కశ్మీరీల ఇబ్బందులు తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. భారత్​ తీసుకుంటున్న చర్యలు దక్షిణాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచుతున్నాయని లేఖలో పేర్కొంది.

Kashmir issue
'కశ్మీర్'​పై పంతం వీడని పాక్​.. ఐరాసకు మరోమారు లేఖ

By

Published : Dec 19, 2019, 10:06 AM IST

జమ్ముకశ్మీర్​ విభజన, అధికరణ​ 370 రద్దు చేసి 4 నెలలు గడిచినా ఈ అంశంపై పాకిస్థాన్​ తన వక్రబుద్ధిని చూపుతూనే ఉంది. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టాలని చూసి బోల్తాపడినప్పటికీ.. కశ్మీర్​ అంశాన్ని వీడటం లేదు. కశ్మీర్​ పరిస్థితులపై దృష్టి సారించాలని కోరుతూ.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, భద్రతా మండలి అధ్యక్షుడికి మరోమారు లేఖ రాశారు పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి ఖురేషీ.

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​, ఐరాస భద్రత మండలికి ఎప్పటికప్పుడు కశ్మీర్​ పరిస్థితులను ఖురేషీ వివరిస్తున్నట్లు పాక్​ విదేశాంగ శాఖ పేర్కొంది.

ఈ నెల 12న లేఖ...

తాజాగా ఈ నెల 12న లేఖ రాశారు ఖురేషీ. దక్షిణాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను భారత్​ తీసుకుంటున్న చర్యలు మరింత పెంచుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఐరాస భద్రత మండలి తన సరైన పాత్రను పోషించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతకు విఘాతం కలగటం, కశ్మీరీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని తెలిపారు. కశ్మీర్​పై అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు భారత్​ తప్పుడు ప్రచారాలు చేపడుతోందని పేర్కొన్నారు ఖురేషీ.

గతంలో ఆరుసార్లు..

గతంలో ఆగస్టు 1,6,13,26, సెప్టెంబర్​ 12, అక్టోబర్​ 31న పలుమార్లు ఐరాస ప్రధాన కార్యదర్శి, యూఎన్​ఎస్​ అధ్యక్షుడికి లేఖలు రాశారు ఖురేషీ.

ABOUT THE AUTHOR

...view details