ప్రపంచదేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో పలు దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ రెండోసారి వారం రోజులపాటు లాక్డౌన్ విధించనుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
2500మంది నిర్బంధం!
స్విట్జర్లాండ్‌లో లాసాన్ నగరంలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 2,500 మంది విద్యార్థులను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆ దేశ వైద్యాధికారులు ఆదేశించారు.
సింగపూర్‌లో సడలింపు..
సింగపూర్‌లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. ప్రాంతీయ లేదా అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం కొత్త బిజినెస్ ట్రావెల్ పాస్‌ను ప్రవేశపెట్టింది.
కరోనా కేసులు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 21 లక్షల 67 వేలు దాటింది. ఇప్పటివరకు 9 లక్షల 83 వేల మందికి పైగా మృతి చెందారు. 2 కోట్ల 37 లక్షల 38 వేల మందికిపైగా కోలుకున్నారు. అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
ఇదీ చూడండి:నేపాల్- చైనా మధ్య కీలక వాణిజ్య మార్గం పునఃప్రారంభం