Quad foreign ministers meet: క్వాడ్ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులు మెల్బోర్న్లో సమావేశమయ్యారు. స్వేచ్ఛ, సమ్మిళిత ఇండో-ఫసిపిక్ సహా ఉగ్రవాదం వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోశిమాస హయాశి, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి మేరిస్ పేన్ పాల్గొన్నారు. భేటీ అనంతరం క్వాడ్ దేశాల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
భేటీ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మేరిస్ పేన్ చైనాకు పరోక్ష సందేశం పంపారు. స్వేచ్ఛా విలువలు, జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడటం, నిబంధనలు సరిగ్గా పాటించేలా చూసేందుకు క్వాడ్ దేశాలు పనిచేస్తాయని పునరుద్ఘాటించారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. క్వాడ్ దేశాల మధ్య దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక కలయికలు, భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు అన్నీ కలిసి క్వాడ్‌ను శక్తివంతమైన, గణనీయమైన ఫ్రేమ్‌వర్క్‌గా మార్చాయని చెప్పారు. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ విజన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఎజెండాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌లో మరింత శాంతి, స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి క్వాడ్ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.