తెలంగాణ

telangana

ETV Bharat / international

Putin taxi driver news: నేడు రష్యాకు అధ్యక్షుడు.. నాడు ట్యాక్సీ డ్రైవర్​!

Putin worked as taxi driver: వ్లాదిమిర్​ పుతిన్​. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన రష్యాకు అధ్యక్షుడు. ఆయన ధైర్యసాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటి పుతిన్​.. ఒకానొక సందర్భంలో.. పొట్ట నింపుకునేందుకు ట్యాక్సీ డ్రైవర్​గా మారారన్న విషయం మీకు తెలుసా?

Putin taxi driver news
రష్యా అధ్యక్షుడు పుతిన్​

By

Published : Dec 13, 2021, 4:02 PM IST

Putin taxi driver news: అది 1991వ సంవత్సరం. సోవియట్​ యూనియన్​కు గడ్డుకాలం! పశ్చిమాన ఉన్న బాల్టిక్​ నుంచి మధ్య ఆసియా వరకు ఎన్నో దేశాలు సోవియట్​​ యూనియన్​లో భాగంగా ఉండేవి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది ఈ​ యూనియన్​. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ లోలోపల.. ఆర్థిక సంక్షోభంతో యూనియన్​ విలవిల్లాడిపోయింది. అప్పులు తీర్చలేని స్థితిలో పడిపోయింది. చివరికి.. సోవియట్​ యూనియన్​ కుప్పకూలిపోయింది. యూనియన్​లో కేంద్రబిందువుగా ఉన్న రష్యా.. చివరికి ఒంటరిగా మిగిలిపోయింది.

ఆ సమయంలో పుతిన్​.. సోవియెట్​ యూనియన్​కు చెందిన కేజీబీ సెక్యూరిటీ సర్వీసెస్​లో ఏజెంట్​గా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఆయన ఓ నమ్మిన బంటు. సోవియట్​​ యూనియన్​ విడిపోవడం వల్ల ఏర్పడిన సంక్షోభానికి.. సాధారణ ప్రజల్లానే.. ఆయన కూడా ఇబ్బందులు పడ్డారు.

"సోవియట్​ యూనియన్​ కుప్పకూలడం.. 20వ దశాబ్దానికే అతిపెద్ద భౌగోళిక రాజకీయ విపత్తు. ఆ వార్త విని నేను నమ్మలేకపోయాను. చారిత్రక రష్యాకు ఆ రోజుతో ముగింపు పడింది. అప్పట్లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి. నేను కొంత ఎక్కువ సంపాదించాల్సి వచ్చేది. ట్యాక్సీ డ్రైవర్​గా పనిచేసిన రోజులూ ఉన్నాయి. వాటిని ఇప్పుడు గుర్తుతెచ్చుకోవడం కొంత అసహ్యకరంగా ఉంది. దురదృష్టవశాత్తు అప్పడు నాది ట్యాక్సీ నడుపుకోవాల్సిన పరిస్థితి."

-- వ్లాదిమిర్​ పుతిన్​, రష్యా అధ్యక్షుడు.

Vladimir Putin news:

'రష్యా- రీసెంట్​ హిస్టరీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఛానెల్​ వన్​ అనే సంస్థ. ఇందులో పుతిన్​ మాట్లాడి.. నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలను రష్యా అధికారిక వార్తా సంస్థ ఆర్​ఐఏ నొవోస్తి ఆదివారం ప్రచురించింది.

ఇదీ చూడండి:-పుతిన్ స్కెచ్ వేస్తే ప్రత్యర్థి ఎవరైనా గప్​చుప్​

ABOUT THE AUTHOR

...view details