వివాదాస్పద చట్టాలకు పుతిన్ ఆమోదం రష్యా అధ్యక్షుడు రెండు వివాదాస్పద బిల్లులపై సంతకం చేశారు. ఈ బిల్లుల ప్రకారం అధికారుల పట్ల అగౌరవంగా ప్రవర్తించేవారిపై కోర్టులు జరిమానా విధించవచ్చు.నకీలీ వార్తలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవచ్చు.
జరిమానా.. జైలు శిక్ష
ప్రభుత్వ అధికారులను, జాతీయ చిహ్నాలను అగౌరవపరిచే వారికి భారీ జరిమానా విధించించేలా మొదటి చట్టం రూపొందింది. మాటిమాటికీ ఇదే చర్యలకు పాల్పడితే 15 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంది.
అసత్య వార్తలపై..
రెండో బిల్లు ప్రకారం.. అసత్య వార్తలు ప్రచురించే చేసే మీడియా సంస్థలపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకోవచ్చు.
వెబ్సైట్లలోని వార్తా కథనాలను పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది పుతిన్ ప్రభుత్వం. అసత్య, నకిలీ వార్తను తొలగించాలని మీడియా సంస్థలకు ఆ వ్యవస్థ సూచించనుంది. వాటిని తొలగించకపోతే నిషేధించే అధికారమూ ఉంటుంది.
నకిలీ వార్తలపై భారీ జరిమానాలను విధించాలని చట్టంలో ఉంది. వార్త ... అల్లర్లకు, మరణాలకు దారితీస్తే 22,700 మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తుంది. వార్త తీవ్రతను బట్టి నిషేధం విధించే అవకాశమూ ఉంది.
మానవ హక్కుల కార్యకర్తల ఆగ్రహం
తమ సూచనలను పక్కనపెట్టి బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేశారని మానవహక్కుల సంఘం కార్యకర్తలు ఆరోపించారు. ఈ చట్టాలు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయని వారు హెచ్చరించారు. ఇవి వాక్స్వాతంత్ర్యపు హక్కును హరించేలా ఉన్నాయని విమర్శించారు.
2000 సంవత్సరంలో పుతిన్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి రష్యాలో స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా పోయిందని, మీడియాను అధీనంలోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలను ఉపయోగించుకుని పుతిన్ తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని అణగదొక్కే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.