కొద్దిరోజులుగా కరోనా సంక్షోభంతో ఇబ్బందులను ఎదుర్కొన్న రష్యా.. ఇప్పుడిప్పుడే వైరస్ పరిస్థితుల నుంచి బయటపడుతోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు. అయితే ఈ విషయంలో అమెరికా మరింతగా పోరాడుతోందని తెలిపారు పుతిన్.
'కరోనా నుంచి మేం కోలుకుంటున్నాం.. అమెరికా కష్టం' - కరోనా సంక్షోభం నుంచి రష్యా కోలుకుంటోంది
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా నుంచి.. రష్యా క్రమంగా కోలుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అయితే అమెరికాలోని పరిస్థితుల ప్రభావం వల్ల.. ఆ దేశం ఇంకా పోరాడాల్సి వస్తోందన్నారు.
కరోనా నుంచి మేం కోలుకుంటున్నాం.. అమెరికా కష్టం
వైరస్ నుంచి బయట పడేందుకు తాము నిరంతర కృషి చేస్తనున్నామన్న పుతిన్.. త్వరలోనే మహమ్మారిని జయిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాపై పోరాడుతున్నాయని.. అమెరికాలోని పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని వివరించారు పుతిన్.
ఇదీ చదవండి:కొవిడ్-19లో 3 దశలను గుర్తించిన ఇటలీ
Last Updated : Jun 15, 2020, 11:22 AM IST