అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎలక్టోరల్ కాలేజీ అధికారంగా ఎన్నుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. బైడెన్ గెలుపు అందరి విజయంగా అభివర్ణించిన క్రెమ్లిన్.. ప్రపంచ భద్రత, స్థిరత్వం సహా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై పోరుకు ఇరు దేశాలు కలిసి పని చేయాలని బైడెన్‌కు పంపిన సందేశంలో పేర్కొంది.
"పరస్పర గౌరవం, సమానత్వం సిద్ధాంతాలకు అనుగుణంగా.. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం అమెరికా, రష్యాలు సహకారం అందించుకుంటాయి. అమెరికాతో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను." అంటూ క్రెమ్లిన్ ద్వారా తన సందేశాన్ని పంపారు పుతిన్.