ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు స్మారక యుద్ధ పతకాన్ని ప్రదానం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియా భూభాగంలో మరణించిన సోవియట్ సైనికుల స్మారకాన్ని సంరక్షించడంలో కిమ్ పాత్రకు గుర్తింపుగా ఈ పతకాన్ని ప్రదానం చేశారు.
ప్యాంగ్యాంగ్లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ మాట్సెగోరా ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి సోన్-గ్వాన్‌కు ఈ అవార్డును అందజేశారు. కిమ్ ఈ వేడుకకు హాజరు కాలేదు.