తెలంగాణ

telangana

ETV Bharat / international

పుల్వామా దాడిపై పాక్​ కపట నాటకం - భౌగోళిక ప్రాంతాలు

భారత్​ అందించిన జాబితాలోని 22 భౌగోళిక ప్రాంతాల్లో ఎలాంటి ఉగ్రస్థావరాలు లేవని పాకిస్థాన్​ ప్రకటించింది. తాము అదుపులోకి తీసుకున్న 54 మంది అనుమానితులకు పుల్వామా దాడితో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

పుల్వామా దాడిపై పాక్​ కపట నాటకం

By

Published : Mar 28, 2019, 1:22 PM IST

Updated : Mar 28, 2019, 3:40 PM IST

పుల్వామా దాడిపై పాక్​ కపట నాటకం

పుల్వామా దాడికి సంబంధించి పాక్​ మరో నాటకానికి తెరలేపింది. భారత్​ అందించిన జాబితాలోని మొత్తం 22 భౌగోళిక ప్రాంతాల్లో ఎలాంటి ఉగ్రస్థావరాలు లేవని పాకిస్థాన్​ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. భారత్​ ఇచ్చిన జాబితాలోని 54 మందిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపింది. అయితే వాళ్లకు పుల్వామా దాడితో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని ప్రకటించింది. దర్యాప్తులో తేలిన ప్రాథమిక అంశాలతో పాటు ప్రశ్నావళిని భారతదేశానికి అందించింది. భారత్​ అనుమానిస్తున్న ప్రాంతాలను అధికారులు సందర్శించేలా అనుమతివ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది పాక్.

ఫిబ్రవరి 27న సమర్పించిన భారత్​...

పాకిస్థాన్​లోని పుల్వామా దాడికి బాధ్యులైన జైషే మహ్మద్​ ఉగ్రవాదుల స్థావరాలు, నాయకుల వివరాలు దిల్లీలోని పాక్​ హైకమిషనర్​కు ఫిబ్రవరి 27న అందించింది భారత్​. పుల్వామా దాడికి బాధ్యులమని 'అదిర్​ దర్​' ప్రకటిస్తున్న రహస్య వీడియో, 90 మంది అనుమానితులు, 22 ఉగ్రస్థావరాలతో పాటు వీడియోలు షేర్​ చేయటానికి ఉపయోగించిన వాట్సాప్​, టెలిగ్రాం నంబర్ల వివరాలు అందులో ఉన్నాయి.

ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్​ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది.

భారత్​ ఇచ్చిన సమాచారం ఆధారంగా సామాజిక మాధ్యమాలపైనా విశ్లేషణ ప్రారంభించాం. ఫోన్​ నంబర్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని సర్వీస్​ ప్రొవైడర్లను కోరాం. వాట్సాప్​ నుంచి సహాయం పొందటానికి అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశాం. - పాక్​ విదేశాంగ కార్యాలయం ప్రకటన.

Last Updated : Mar 28, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details