నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ట్వీట్‌ను హిందీలో పోస్ట్ చేసింది ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్. ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ పురస్కారం ఇవ్వాలనిఈ నెల రెండో తేదీనతీర్మానించింది ఆ దేశ పార్లమెంట్. పాక్‌లో బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను వెనక్కి పంపి ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేశారని పాక్ పార్లమెంటు ఇమ్రాన్‌ను కొనియాడింది.
హిందీలో ట్వీట్..! - నోబెల్ పురస్కారం
నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడిని కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్‌ను హిందీలో పోస్ట్ చేసింది ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్.
ఇమ్రాన్ వ్యాఖ్యలను హిందీలో పోస్ట్ చేసిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్
దీనిపై స్పందించారు పాక్ ప్రధాని ఇమ్రాన్. తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని కాదని పేర్కొన్నారు.
"నోబెల్ శాంతి పురస్కారానికి నేను అర్హుడిని కాదు. కశ్మీర్ సమస్యను తీర్చిన వారికే నోబెల్ శాంతి పురస్కారాన్ని అందించాలి. కశ్మీరీల మనోభావాలకు అనుగుణంగా శాంతిని, అభివృద్ధిని పెంపొందించిన వారికి అందించాలి." ట్విట్టర్లో ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని.