మయన్మార్లో సైనికపాలనకు వ్యతిరేకం ఆందోళనలు కొనసాగుతున్నాయి. సైనిక తిరుగుబాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టినీ షారనర్ బర్గ్‌నర్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిరసనలు మరింత ఉద్ధృతంగా మారాయి. దీంతో యాంగూన్ నగరం సహా కచిన్, దావీ రాష్టాల్లో ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు సైనికులు.
మయన్మార్ ఆందోళన: నిరసనకారులపై బాష్పవాయువు
మయన్మార్లో సైనిక తిరుగుబాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐరాస భద్రతా మండలికి ఆ సంస్థ రాయబారి క్రిస్టినీ షారనర్ బర్గ్‌నర్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. ఆందోళనలు మరింత ఉద్ధృతంగా మారాయి. దీంతో నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.
ఆ విజ్ఞప్తితో మరింత ఉద్ధృతంగా మయన్మార్ నిరసనలు
మయన్మార్ సైన్యం శాంతియుతంగా నిరసన తెలిపిన 50 మంది అమాయకుల ప్రాణాలను తీసిందని ఐరాకు ఫిర్యాదు చేశారు బర్గ్‌నర్. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా సైన్యాన్ని దూరంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పలు నగరాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు.