తెలంగాణ

telangana

ETV Bharat / international

గిల్గిత్​ బాల్టిస్థాన్​లో పాక్​ సర్కారుకు నిరసన సెగ - గిల్గిత్​ బాల్టిస్థాన్ పాకిస్థాన్​ ప్రభుత్వం

గిల్గిత్​ బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా కల్పించాలని యత్నిస్తున్న పాకిస్థాన్​ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రజల హక్కులను ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం.. కాలరాస్తోందంటూ పెద్దఎత్తున ఆందోళన చేశారు ప్రజలు. హక్కుల సంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

Protests erupt against Pak's attempt to alter status of Gilgit Baltistan
గిల్గిత్​ బాల్టిస్థాన్​లో పాక్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు!

By

Published : Oct 13, 2020, 2:45 PM IST

పాకిస్థాన్​ ప్రభుత్వం ప్రజల హక్కులనుకాలరాస్తోందంటూ... గిల్గిత్​ బాల్టిస్థాన్​లో ఆందోళన నిర్వహించారు నిరసనకారులు. తప్పుడు ఆరోపణలు మోపి, అరెస్ట్​ చేసిన హక్కుల సంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిత్​ బాల్టిస్థాన్​లో రాజకీయ స్థితిని మార్చాలని యత్నిస్తున్న పాక్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.

ప్రాణ త్యాగానికైనా..

గిల్గిత్​ బాల్టిస్థాన్​లో పాక్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు!

పీఓకేలోని ముజఫరాబాద్​ నగరంలో ఆదివారం.. జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​, స్టూడెంట్​ లిబరేషన్​ ఫ్రంట్​ నేతలు.. పాక్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. గిల్గిత్​ బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా కల్పించాలని యత్నిస్తున్న పాక్​ ప్రభుత్వం.. వెనక్కి తగ్గాలని డిమాండ్​ చేశారు. ఈ పోరాటంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు.

"కారాగారాల్లో ఉన్న నేతలను విడుదల చేసేవరుకు మేం శాంతించం. మమ్మల్ని ఇదివరకే అరెస్ట్​ చేశారు. అసీరన్​-ఐ-హుంజా రిహాయ్​ కమిటీ తదుపరి ఆదేశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. వాళ్లు మాకు పిలుపివ్వగానే.. పాకిస్థాన్​ అంతటా మా నిరసనను ఉద్ధృతం చేస్తాం."

-- గిల్గిత్​ బాల్టిస్థాన్​ యూత్​ అలైయన్స్​ కమిటీ నేత

పాకిస్థాన్​లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న గిల్గిత్​ బాల్టిస్థాన్​కు చెందిన ప్రజలు కూడా ఆందోళన బాటపట్టారు. గిల్గిత్​ బాల్టిస్థాన్​ను​ ఐదో రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది పాక్​ ప్రభుత్వం. ​ఈ ప్రకటనతో.. గిల్గిత్​ బాల్టిస్థాన్​ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి.

ఇదీ చూడండి:పాక్​ ఆయుధ స్మగ్లింగ్ కుట్ర భగ్నం

ABOUT THE AUTHOR

...view details