తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు- లైవ్ ఇచ్చిన జర్నలిస్ట్​కు తాలిబన్ల శిక్ష

పంజ్​షేర్​లో(panjshir valley) పాక్​ జెట్స్​ వైమానిక దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ.. కాబుల్​లోని(Kabul news) పాకిస్థాన్​ రాయబార కార్యాలయం ఎదుట అఫ్గాన్​ పౌరులు, మహిళలు నిరసనలకు దిగారు. ఎంబసీ సిబ్బంది తమ దేశాన్ని విడిచి వెళ్లాలని డిమాండ్​ చేశారు. తమకు కీలకబొమ్మ లాంటి ప్రభుత్వం అవసరం లేదని స్పష్టం చేశారు.

Protests against pakistan
పాకిస్థాన్​కు వ్యతిరేకంగా అఫ్గాన్​లో ఆందోళనలు

By

Published : Sep 7, 2021, 4:51 PM IST

Updated : Sep 7, 2021, 6:22 PM IST

పాకిస్థాన్​కు వ్యతిరేకంగా అఫ్గాన్​లో ఆందోళనలు

అఫ్గానిస్థాన్​ రాజధాని​లోని పాకిస్థాన్​ రాయబార కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు(Kabul protest) దిగారు ఆ దేశ ప్రజలు. పంజ్​షేర్​ ప్రావిన్స్​లో(panjshir valley) పాక్​ జెట్స్​ వైమానిక దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ.. కాబుల్​ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 'పాకిస్థాన్​కు మరణం' 'స్వేచ్ఛ' ' అల్లాహ్​ అక్బర్​' 'మాకు బంధీఖానాలు వద్దు' వంటి నినాదాలు చేశారు. పాకిస్థాన్​ ఎంబసీ ఉద్యోగులు తమ దేశాన్ని విడిచి వెళ్లాలని డిమాండ్​ చేశారు. తమకు ఒకరి చేతిలో ఉండే కీలబొమ్మ ప్రభుత్వం అవసరం లేదని, అందరి భాగస్వామ్యంతో ఉండే ప్రభుత్వం కావాలన్నారు.

నిరసనల్లో పాల్గొన్న అఫ్గాన్​ మహిళలు

పంజ్​షేర్​ను తమ వశం చేసుకున్నట్లు తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్​ ప్రజలు పోరాడాలని ఆడియా క్లిప్​ ద్వారా పంజ్​షేర్​ రెసిస్టెన్స్​ ఫోర్స్​ నేత అహ్మద్​ మసూద్​ కోరిన తర్వాత ఆందోళనకారులు పాక్​ ఎంబసీ వద్దకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారని, అయినప్పటికీ నిరసనలు కొనసాగించినట్లు వెల్లడించింది.

పాక్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలు

బ్లాఖ్​, దైకుండి ప్రావిన్స్​ల్లోనూ సోమవారం రాత్రి ప్రజలు పాకిస్థాన్​కు వ్యతిరేకంగా నిరసనలు చేసినట్లు మీడియా వెల్లడించింది.

నిరసనల్లో పాల్గొన్న మహిళలు

జర్నలిస్టుల అరెస్ట్​

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. నిరసనలను ప్రసారం చేస్తోన్న పలువురు అఫ్గాన్​ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అరెస్ట్​ చేసిన వారిని విడిచిపెట్టాలని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు డిమాండ్​ చేశారు.

తమపై తాలిబన్లు దాడి చేసినట్లు అరెస్ట్​ అయి విడుదలైన పలువురు పాత్రికేయులు తెలిపారు. 'నిరసనలను కవర్​ చేసినందుకు నా ముక్కును నేలపై రాసి.. క్షమాపణలు చెప్పించారు. ప్రాణాలకు రక్షణ లేదు. అఫ్గాన్​లోని జర్నలిస్టులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.' అని ఓ జర్నలిస్ట్​ మీడియాకు తెలిపారు.

నిరసనల్లో పాల్గొన్న మహిళలు
కాబుల్​ వీధుల్లో ఆందోళనలు చేస్తున్న స్థానికులు

ఇదీ చూడండి:Haqqani Taliban: పాక్‌ స్క్రీన్‌ ప్లే.. హక్కానీల హైడ్రామా!

Last Updated : Sep 7, 2021, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details