తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​లో భగ్గుమన్న నిరసన జ్వాల - మయన్మార్​ సైనిక వ్యతిరేక ఆందోళనలు

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నిర్బంధంలో ఉంచిన ఆంగ్​ సాన్​ సూకీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ.. యాంగూన్​ నగరంలో పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు.

Protesters rally in Yangon against army takeover in Myanmar
మయన్మార్​లో భగ్గుమన్న నిరసన జ్వాలలు

By

Published : Feb 8, 2021, 12:47 PM IST

Updated : Feb 8, 2021, 1:53 PM IST

మయన్మార్​ సైనిక తిరుగుబాటును నిరసిస్తూ చేస్తోన్న ఆందోళనలు భగ్గుమన్నాయి. దేశ ఆర్థిక రాజధాని నగరమైన యాంగూన్​లో రోడ్డెక్కిన ఆందోళనకారులు.. 'మిలటరీ నియంతృత్వం నశించాలి', 'ప్రజాస్వామ్యం కావాలి' అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు. నిర్బంధంలో ఉన్న తమ నాయకురాలు ఆంగ్​ సాన్​ సూకీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.

యాంగూన్​లో రోడ్లపై ర్యాలీ చేపట్టిన నిరసనకారులు

గత శనివారం ఆందోళనలు మరింత ఉద్ధృతం కావడం వల్ల.. ఇంటర్నెట్‌ సేవలను పరిమితం చేసింది సైన్యం. అయితే.. ఆదివారం వీటిని పునరుద్ధరించినట్టు సమాచారం.

2020 నవంబర్​లో జరిగిన ఎన్నికల్లో జరిగిన మోసాలపై అందిన ఫిర్యాదులను పరిష్కరించడంలో సూకీ విఫలమైందని మిలటరీ ఆరోపణలు చేస్తోంది.

ఇదీ చదవండి:అభిశంసనపై ట్రంప్​కు రిపబ్లికన్ సెనేటర్ల అండ

Last Updated : Feb 8, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details