హాంకాంగ్‌లో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. చైనా జాతీయ గీతాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు సంబంధించి చట్టసభ సభ్యులు చర్చలు జరుపుతుండగా.. హాంకాంగ్‌లో వేలాది మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసెంబ్లీ సమావేశానికి ముందు.. శాసనసభ భవనం వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరిని నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు.
కాజ్వే బేయ్ జిల్లాలోని ఓ షాపింగ్‌మాల్ ఎదుట సుమారు 50 మందికిపైగా నిరసన చేస్తుండగా... పోలీసులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. విధుల్లో ఉన్న పాత్రికేయులను కూడా అడ్డుకున్నారు. అనధికారికంగా గుమిగూడిన సుమారు 300 మందిని అరెస్ట్ చేసినట్లు హాంకాంగ్ పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాసోలిన్ బాంబులు కలిగి ఉన్న మరో 17 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.