హాంకాంగ్లో.. నేరస్థులను చైనాకు అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు మిన్నంటుతున్నాయి. పది వారాలుగా జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు మంగళవారం కూడాహాంకాంగ్ విమానాశ్రయాన్ని స్తంభింపజేశారు. ఫలితంగా వందలాది విమానాలను అధికారులు రద్దు చేశారు.
నగర నాయకుడి హెచ్చరికలను ధిక్కరించిన నిరసనకారులు వెనుదిరిగేది లేదని స్పష్టం చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదనే నెపంతోనే పోలీసులు ఈ చర్యకు దిగారు. ఇద్దరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
హాంకాంగ్సరిహద్దులకు చైనా దళాలు