కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో ఈ వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో మాస్కులకు డిమాండ్ పెరిగింది. లాభాలు తెచ్చిపెట్టే సరికొత్త మార్కెట్లోకి చైనాలో వేల సంఖ్యలో సంస్థలు పుట్టుకొచ్చాయి. మాస్కులను తయారు చేసి విదేశాలు ఎగుమతి చేస్తూ భారీగా లాభాలు అర్జిస్తున్నాయి.
ఈఏడాది ఫిబ్రవరిలో చైనాలో కొవిడ్-19 విజృంభించి వేల సంఖ్యలో ప్రజలకు సోకింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మాస్కుల తయారీలోకి అడుగుపెట్టింది గ్వాన్ జున్జే అనే సంస్థ. కేవలం 11 రోజుల్లోనే పరిశ్రమను స్థాపించి ప్రస్తుతం ఎగుమతులు చేస్తూ లాభాలు స్వీకరిస్తోంది.
" మాస్కుల తయారీ పరికరం అనేది ఇప్పుడు నిజంగా నగదు ముద్రణ యంత్రమే. మాస్కుల వ్యాపారంలో లాభం గతంలో కంటే పలు రేట్లు అధికంగా ఉంది. రోజుకు 60-70 వేల మాస్కులు ఉత్పత్తి చేయటమంటే నగదును ముద్రించటానికి సమానం."
- జింగ్హూయి, సేల్స్ మేనేజర్, మాస్కుల తయారీ సంస్థ