President Kovind Bangladesh visit: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో రామ్‌నాథ్ పర్యటిస్తున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే శ్రీ రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించారు.
50 ఏళ్ల క్రితం ధ్వంసం
1971 Indo Pak war: 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ బలగాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాయి. 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరుతో పాకిస్థానీ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయానికి నిప్పంటించాయి. ఫలితంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.