President Kovind Bangladesh visit: మూడు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహుముఖ, సమగ్రమైన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
" రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పీఎం షేక్ హసీనా భేటీ అయ్యారు. ఇరుపక్షాలు బహుముఖ, సమగ్ర ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. 1971 నాటి విముక్తి పోరాటం స్ఫూర్తిని ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారు. మైత్రి దివస్‌ను సంయుక్తంగా నిర్వహించటంపై సంతృప్తి వ్యక్తం చేశారు."
- ఆరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి.