నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ)లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్ సుభాష్ నెంబాంగ్తో సమావేశమయ్యారు ప్రచండ. పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాల పరిష్కారంపై చర్చించారు.
ప్రధాని కేపీ శర్మ ఓలీ, ప్రచండల మధ్య గురువారం జరగాల్సిన భేటీ కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఇందులో భాగంగానే ప్రధాని తరఫున నెంబాంగ్.. పార్టీ ఛైర్మన్ ప్రచండతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ స్పీకర్.. సమావేశం సానుకూలంగా సాగిందన్నారు. కానీ ఎలాంటి కీలక విషయాలు వెల్లడించలేదు
"ప్రచండతో భేటీ సానుకూలంగా సాగింది. చీలికలు ఏర్పడకుండా పార్టీని కాపాడేందుకు ఇరువురు అగ్రనేతల మధ్య అవగాహన ఏర్పరిచేందుకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది."