తెలంగాణ

telangana

ETV Bharat / international

'రాజకీయ స్థిరత్వంతో పెట్టుబడుల స్వర్గధామంగా భారత్​' - మోదీ

యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు భారత్​ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయన్నారు మోదీ.

'రాజకీయ స్థిరత్వంతో పెట్టుబడుల స్వర్గధామంగా భారత్​'

By

Published : Aug 24, 2019, 4:28 PM IST

Updated : Sep 28, 2019, 3:07 AM IST

'రాజకీయ స్థిరత్వంతో పెట్టుబడుల స్వర్గధామంగా భారత్​'

రాజకీయ స్థిరత్వం సహా ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు భారత్​ను ప్రపంచంలోనే పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు మోదీ.

"రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు భారత్​ను ప్రపంచంలోనే పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయి. వృద్ధిని ప్రోత్సహించడానికి, ఉపాధి మార్గాలను రూపొందించడానికి, మేక్​ ఇన్​ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని విధానాలను రూపొందించింది. వీటి ద్వారా పారిశ్రామికవేత్తలు వారి పెట్టుబడుల ద్వారా మంచి రాబడి పొందుతారు. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రదేశాలు మీవే. ముఖ్యంగా జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాల్లో అభివృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకోబోయే అభివృద్ధి కార్యక్రమాలు భారత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

రూపే కార్డు సేవలు ప్రారంభం...

యూఏఈ పర్యటనలో భాగంగా భారతీయ డెబిట్​, క్రెడిట్​ కార్డు అయిన రూపే సేవలను ప్రారంభించారు ప్రధాని మోదీ. తద్వారా... రూపే కార్డు వినియోగించిన తొలి పశ్చిమాసియా దేశంగా నిలిచింది ఎమిరేట్స్​.

రుపే కార్డు సేవల ప్రారంభం

2012లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రూపే కార్డును ఇప్పటికే సింగపూర్​, భూటాన్​ దేశాల్లో వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్​-పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ద్విముఖ వ్యూహం!

Last Updated : Sep 28, 2019, 3:07 AM IST

ABOUT THE AUTHOR

...view details