ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌లో మొదలైన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి కార్యకర్త మృతిపట్ల కోపోద్రిక్తులైన నిరసనకారులు హాంకాంగ్‌లోని ఓ సబ్‌స్టేషన్‌ను, వాణిజ్య సముదాయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.
ప్రజాస్వామ్య అనుకూల శాసనకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు చేపట్టారు. హాంకాంగ్ అధినేత క్యారీ లామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులను బొద్దింకలుగా పిలుస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి భాష్ప వాయు గోళాలు, పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు పోలీసులు. కొందరు నిరసనకారులను అరెస్టు చేశారు.