తెలంగాణ

telangana

హాంకాంగ్​: న్యూఇయర్​ రోజున నిరసనలు హింసాత్మకం

హాంకాంగ్​లో కొత్త ఏడాది సందర్భంగా వేలాది మంది నిరసనకారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. బదులుగా పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారు నిరసనకారులు.

By

Published : Jan 1, 2020, 8:35 PM IST

Published : Jan 1, 2020, 8:35 PM IST

Police, protesters clash during huge Hong Kong pro-democracy rally
హాంకాంగ్​: న్యూఇయర్​ రోజున నిరసనలు హింసాత్మకం

హాంకాగ్​లో నూతన ఏడాది సందర్భంగా వేలాది మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు రోడ్లపై ప్రదర్శనలు చేపట్టారు. ఓ వైపు శాంతియుత ర్యాలీలు జరుగుతుంటే.. వాన్​చాయ్​ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఆగ్రహంతో ఆందోళనకారులు వారిపై పెట్రోలు బాంబులను విసిరారు. మరికొన్ని ప్రాంతాల్లో బారికేడ్లకు నిప్పంటించారు.

చైనా నుంచి తమకు స్వేచ్ఛ కావాలని దాదాపు ఏడు నెలల నుంచి హాంకాంగ్​లో నిరసనలు హోరెత్తుతున్నాయి. 2019 నుంచి ఈ ఏడాది వరకు తమ డిమాండ్లు నేరవేరకపోవడం విచారంగా ఉందని ఓ ఆందోళనకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

సార్వత్రిక ఓటు హక్కు , నిరసనకారులపై పోలీసుల వ్యవహరించిన తీరుపై విచారణ, ఉద్యమ సమయంలో అరెస్టయిన 6,500 మందిని విడుదల చేయడం వంటి డిమాండ్లతో కూడిన బ్యానర్లను ర్యాలీలో ప్రదర్శించారు నిరసనకారులు.

హాంకాంగ్​: న్యూఇయర్​ రోజున నిరసనలు హింసాత్మకం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details