తెలంగాణ

telangana

ETV Bharat / international

మాస్కులపై రగడ... హాంకాంగ్​ మరోమారు ఉద్రిక్తం - హాంకాంగ్​లో ప్రజాస్వామ్యవాదుల నిరసనలు

హాంకాంగ్​లో ఆందోళన చేపడుతున్న ప్రజాస్వామ్యవాదులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. నిరసనకారులు మాస్కులు ధరించకూడదంటూ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసిన నేపథ్యంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ అధికారాలు ఉపయోగించడాన్ని న్యాయస్థానం సమర్థించింది.

మాస్కులపై రగడ... హాంకాంగ్​ మరోమారు ఉద్రిక్తం

By

Published : Oct 6, 2019, 6:29 PM IST

మాస్కులపై రగడ... హాంకాంగ్​ మరోమారు ఉద్రిక్తం

హాంకాంగ్​లో ప్రజాస్వామ్యవాదుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం మాస్కులు ధరించడంపై నిషేధం విధించడాన్ని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రదర్శన చేపట్టారు. ఫలితంగా నగరంలోని సగం సబ్​వేలు మూతపడ్డాయి.

ప్రభుత్వ అనుమతి లేకపోయినా ఆందోళనకారులు విక్టోరియా హార్బర్ ఇరువైపులా భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళనలు చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొడుతున్నారు.

ఎమర్జెన్సీ ...

హాంకాంగ్​లో కొద్ది రోజుల క్రితం కొందరు నిరసనకారులు షాపింగ్ మాల్స్​ను, సబ్​వేలను ధ్వంసం చేశారు. ముసుగులు ధరించడం వల్ల వీరిని గుర్తించడం కష్టమవుతోంది. ఫలితంగా మాస్కులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకోసం గత 50 ఏళ్లలో తొలిసారిగా ఎమర్జెన్సీ అధికారాలు వినియోగించింది.

మాస్కులు ధరించడంపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రజాస్వామ్యదులు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర ఆదేశాలు రాజ్యాంగాన్ని, చట్టాన్ని అతిక్రమించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కమల్​: ప్రచార అస్త్రాలుగా 370, ఎన్​ఆర్​సీ, మోదీ

ABOUT THE AUTHOR

...view details