తెలంగాణ

telangana

ETV Bharat / international

మారిషస్​లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

మారిషస్​లో పలు అభివృద్ధి పనులను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మారిషస్​​ ప్రధాని ప్రవీంద్ జగ్​నాథ్​తో కలిసి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మెట్రో రైలు, ఈఎన్​టీ ఆసుపత్రిని​ ప్రారంభించారు.

మారిషస్​లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

By

Published : Oct 4, 2019, 5:02 AM IST

Updated : Oct 4, 2019, 6:28 AM IST

మారిషస్​లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

మారిషస్​లో మెట్రో రైలు, ఈఎన్​టీ ఆసుపత్రిని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగ్​నాథ్​తో కలిసి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని నిర్మాణాలు

ఈఎన్​టీ ఆసుపత్రిని ఆధునిక హంగులతో నిర్మించారని మోదీ అన్నారు. ఇందులో కాగిత రహిత సేవలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆ దేశంలో మరిన్ని ఆసుపత్రుల నిర్మాణం చేపడతామన్నారు. త్వరలో సుప్రీంకోర్టు, 1000 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు మోదీ వెల్లడించారు.

ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం మారిషస్​ అభివృద్ధికి భారత్​ ఎంతలా కట్టుబడి ఉందో తెలియజేస్తుందన్నారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని, ఇది ఇరు దేశాల మైత్రికి ఇది నిదర్శనమని అన్నారు.

ఇదీ చూడండి:కర్తార్​పుర్ ప్రారంభోత్సవానికి అగ్రనేతలు హాజరు!

Last Updated : Oct 4, 2019, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details