తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగబంధు సమాధికి మోదీ నివాళులు - ప్రధాని మోదీ బంగ్లేదేశ్​ పర్యటన

బంగ్లాదేశ్​ జాతిపిత బంగబంధు సమాధిని ప్రధాని మోదీ శనివారం సందర్శించి నివాళులు అర్పించారు. బంగబంధు జీవితం స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు.

PM Modi Bangladesh visit, Narendra Modi in Bangladesh
ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : Mar 27, 2021, 3:26 PM IST

బంగ్లాదేశ్​ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తుంగీపారాలోని బంగబంధు సమాధిని సందర్శించారు. పుష్ప గుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బంగబంధు కుమార్తెలైన ఆ దేశ ప్రధాని షేక్​ హసీనా, షేక్​ రెహ్నా పాల్గొన్నారు.

షేక్​ ముజీబుర్​ రహ్మాన్​ జీవితం బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు.

బంగబంధు సమాధికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ
సమాధికి నివాళి అర్పిస్తున్న మోదీ
సమాధికి నివాళి అర్పిస్తున్న మోదీ
సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాని

బంగబంధు సమాధి ఆవరణలో ప్రధాని మొక్కను నాటారు. మోదీ.. బంగ్లాదేశ్​ జాతిపిత బంగబంధు సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన తొలి విదేశీ ప్రధానిగా నిలిచారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి :గాంధీ శాంతి పురస్కారాన్ని రెహ్నాకు అందించిన మోదీ

ABOUT THE AUTHOR

...view details