తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ రెండు రోజుల భూటాన్​ పర్యటన - Bhutan

పొరుగుదేశం భూటాన్​లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జలవిద్యుత్​ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చలు జరపనున్నారు.

ఈ నెల 17న భూటాన్​ పర్యటనకు ప్రధాని మోదీ

By

Published : Aug 10, 2019, 7:02 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూటాన్​లో పర్యటించనున్నారు. ఈనెల 17,18 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జలవిద్యుత్​ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ నగ్మే వాంగ్​చుక్​తో చర్చించనున్నారు. ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్​తోనూ సమావేశం కానున్నారు మోదీ.

'మాంగ్​దెచూ జలవిద్యుత్​ ప్రాజెక్టు'కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మోదీ భూటాన్​ పర్యటనలో ఇదే ప్రధానాంశంగా నిలుస్తుందని విదేశీ కార్యదర్శి విజయ్​ గోఖలే మీడియాకు తెలిపారు. అనంతరం భూటాన్ రాజధాని థింపూలోని రాయల్​ విశ్వవిద్యాలయంలో ప్రధాని ప్రసంగిస్తారని ప్రకటించారు.

" భూటాన్​ 12వ పంచవర్ష ప్రణాళికకు రూ. 5వేల కోట్లు ఆర్థిక సాయమందిస్తామని భారత్​ హామీనిచ్చింది. అందులో భాగంగా మొదటి విడత నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది."

-విజయ్​ గోఖలే, విదేశాంగ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details