కరోనాపై పోరుకు నేడు సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్ కరోనాపై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ‘సార్క్’ కూటమి దేశాల నేతలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనం కోసం కూటమి కలిసి వస్తోందని చెప్పారు.
ఆదర్శంగా ఉందాం!
కరోనా వైరస్‌పై పోరులో ప్రపంచానికి సార్క్ మార్గదర్శకంగా ఉండాలన్న మోదీ.. తాజా వీడియో కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య వ్యవహారాలపై పాకిస్థాన్ ప్రధాన మంత్రికి సలహాదారుగా ఉన్న జాఫర్ మీర్జా పాల్గొంటారు.
ఇదీ చూడండి:చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువే!