ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ స్వేచ్ఛ, సమ్మిళిత వృద్ధిని కొనసాగించడమే భారత్ కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రూనైలో నిర్వహించిన 16వ తూర్పు ఆసియా(Asean Countries) కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వివిధ దేశాలతో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా బహుపాక్షిక సంబంధాలను(Asean India Summit) కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశాల సార్వభౌమాధికారంతో పాటు.. ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక.. గురువారం ప్రారంభంకానున్న 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు.
ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా(10 దేశాలు) ఉన్న ఈ కూటమిలో(Asean Countries).. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సదస్సులో భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు సభ్య దేశాలతో పాటు పాల్గొంటున్నాయి.