తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్​తో మోదీ భేటీ: 'బంధం మరింత బలోపేతం'

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. బిష్కెక్​లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

By

Published : Jun 13, 2019, 7:55 PM IST

Updated : Jun 13, 2019, 9:21 PM IST

భారత్​-రష్యా

పుతిన్​తో మోదీ భేటీ: 'బంధం మరింత బలోపేతం'

అమేఠీ ఆయుధ కర్మాగార ఏర్పాటుకు సహకారం అందించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. బిష్కెక్​లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

"భారత్​కు ప్రత్యేక భాగస్వామి. విశేషమైన బంధం!

ఎస్​సీఓ సదస్సులో భాగంగా పుతిన్​తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. అన్ని రంగాలనూ సమీక్షించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు."

- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మొదటిసారిగా పుతిన్​తో భేటీ అయ్యారు మోదీ. గతేడాది అక్టోబర్​లో ఇండియా-రష్యా 19వవార్షిక సదస్సు కోసం భారత్​కు వచ్చారు పుతిన్​. భారత్​కు ఆయుధాలు, యుద్ధసామగ్రి సరఫరా చేసే దేశాల్లో రష్యా ఎంతో కీలకమైనది.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే'

Last Updated : Jun 13, 2019, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details