తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-20: ఏంజెలా మెర్కెల్​​తో మోదీ భేటీ - జీ-20

జపాన్​లో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా జర్మనీ ఛాన్సిలర్​ ఏంజెలా మెర్కెల్​తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇండో-జర్మన్​ సంబంధాల బలోపేతం, కృత్రిమ మేధస్సు, సైబర్​ సెక్యూరిటీ వంటి అంశాల్లో సహకారంపై చర్చించారు.

జీ-20: ఏంజెలా మెర్కెల్​​తో మోదీ భేటీ

By

Published : Jun 28, 2019, 3:21 PM IST

జీ-20: ఏంజెలా మెర్కెల్​​తో మోదీ భేటీ

ఇండో-జర్మన్​ సంబంధాల బలోపేతంపై విస్తృత చర్చ చేపట్టారు జర్మనీ ఛాన్సిలర్​ ఏంజెలా మెర్కెల్​, భారత ప్రధాని మోదీ. జపాన్​లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సు నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. కృత్రిమ మేధస్సు, సైబర్​ సెక్యూరిటీ వంటి అంశాల్లో ఇరు దేశాల సహాయ సహకారాలపై మాట్లాడారు.

ఇరువురి మధ్య భేటీపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

జీ-20: ఏంజెలా మెర్కెల్​​తో మోదీ భేటీ

"జీ-20 సదస్సులో భాగంగా జర్మనీ ఛాన్సిలర్​ మెర్కెల్​తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కృత్రిమ మేధస్సు, ఈ-రవాణా, సైబర్​ సెక్యూరిటీ, రైల్వే నవీకరణ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై సహకారం పెంపొందించే విషయాలపై చర్చించారు."

- రవీష్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.


సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు మెర్కెల్​.

28 సభ్య దేశాల కూటమి యూరోపియన్​ యూనియన్​లో జర్మనీ, భారత్​తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

ఇదీ చూడండి: మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details