జపాన్‌లోని ఒసాకాలో జరిగిన 14వ జీ-20 దేశాల సదస్సు ముగిసింది. సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ భారత్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. జపాన్‌లో 3 రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల అధినేతలతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 6 జీ-20 సదస్సులకు హాజరయ్యారు మోదీ.
భేటీల పర్వం
జపాన్‌కు గురువారం చేరుకున్న మోదీ.. మొదటగా జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్ చక్రవర్తి 'నరుహితో' పట్టాభిషేకానికి భారత రాష్ట్రపతి హాజరవుతారని ప్రకటించారు మోదీ.