మారిషస్‌లోని సుప్రీం కోర్టు కొత్త భవనాన్ని నేడు ఆ దేశ ప్రధానమంత్రి ప్రవీంద్ కుమార్ జగ్‌నాథ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో మారిషస్ న్యాయవ్యవస్థ సీనియర్ సభ్యులు, ఇరు దేశాల ఉన్నతాధికారుల పాల్గొననున్నారు.
హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సహాకారంలో భాగంగా భారత్ అందించిన సాయంతో దేశ రాజధాని పోర్ట్ లూయీస్‌లో సుప్రీం కోర్టు భవనం నిర్మించారు. రాజధాని నగరంలో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టటం ఇదే తొలిసారి.
మరో ఉదాహరణ..
సుప్రీం కోర్టు భవనం భారత్-మారిషస్ స్నేహబంధానికి మరో ఉదాహరణగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భవనం ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ కీలక ప్రాజేక్టుకు సాయం అందించటం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.