ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అక్టోబరులో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చైనా విస్తరణవాదంపైనే వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
భారత్ మాదిరిగానే జపాన్‌కు కూడా చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అంటున్న చైనా వాదనను జపాన్ వ్యతిరేకిస్తోంది. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని దీవుల విషయంలోనూ జగడం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ- షింజో అబే మధ్య సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకోనుంది.