భూటాన్లో రెండో దశ రూపే కార్డు సేవలను.. ఆ దేశ ప్రధాని లొటాయ్ షెరింగ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. దీంతో భూటాన్వాసులు భారత్లో తమ రూపే కార్డులను వినియోగించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది.
భూటాన్లో 'రూపే' సేవలను ప్రారంభించనున్న మోదీ
భూటాన్లో శుక్రవారం రెండో దశ రూపే కార్డు సేవలు మొదలుకానున్నాయి. ఆ దేశ ప్రధానితో కలిసి భారత ప్రధానమంత్రి మోదీ వర్చువల్గా ఈ సేవలను ప్రారంభించనున్నారు.
రెండోదశ రూపే కార్డులను ప్రారంభించనున్న మోదీ, షెరింగ్
గతేడాది ఆగస్టులో మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా.. తొలిదశ రూపే కార్డులను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలిదశ రూపే కార్డులు అమలు కావడం వల్ల.. భూటాన్లో ఏటీఎం కేంద్రాలు, పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) వంటి సర్వీసులు మొదలయ్యాయి. భారత్కు చెందిన రూపే కార్డుతో డెబిట్, క్రెడిట్ చెల్లింపులు సహా.. ఇ-కామర్స్ సైట్లలో అన్నిరకాల లావాదేవీలు జరుగుతాయి.
ఇదీ చదవండి:క్రిస్మస్‌కు ముందే ఫైజర్ టీకా పంపిణీ!
Last Updated : Nov 20, 2020, 5:53 AM IST