తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ - ద్వైపాక్షిక చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్​ చేరుకున్నారు. ఈ నెల 28,29 తేదీల్లో ఆయన ఒసాకా నగరంలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొననున్నారు.

జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : Jun 27, 2019, 8:12 AM IST

Updated : Jun 27, 2019, 9:11 AM IST

జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం జపాన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ.

జపాన్​లోని ఒసాకా నగరంలో ఈ నెల 28,29 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో మోదీ పాల్గొంటారు. జీ20 సదస్సులో మోదీ పాల్గొనడం ఇది వరుసగా ఆరోసారి.

జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఈ సారి సదస్సులో మహిళా సాధికారత, కృత్రిమ మేధ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు వంటివి తన ప్రధాన అజెండాగా ఉన్నట్లు మోదీ తెలిపారు. అంతేకాకుండా గత ఐదేళ్లలో భారత్ సాధించిన విజయాలను పంచుకునేందు ఈ సదస్సు వేదికకానుందని మోదీ పేర్కొన్నారు.

2022లో జీ20 సదస్సుకు భారత్​ వేదిక కానున్న నేపథ్యంలో ఒసాకాలో రెండు రోజుల సదస్సు చాలా ముఖ్యమైందిగా చెప్పుకొచ్చారు మోదీ. ఆ సమయానికి భారత్​ 75వ స్వాతంత్ర్యంలోకి అడుగుపెడుతుందని గుర్తుచేశారు.

ఇదీ చూడండి: 'బహుళ పాక్షిక సంబంధాలపైనే భారత్​ దృష్టి'

Last Updated : Jun 27, 2019, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details