తెలంగాణ

telangana

ETV Bharat / international

గాంధీ శాంతి పురస్కారాన్ని రెహ్నాకు అందించిన మోదీ - బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య వేడుకలు

బంగ్లాదేశ్​ స్వాతంత్ర్యోద్యమంలో భాగమైనందుకు గర్విస్తున్నాని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా జాతిపిత షేక్​ ముబ్పుర్​ రహ్మాన్​కు ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన కుమార్తెకు అందించారు. మోదీ పర్యటనకు బంగ్లా ప్రధాని షేక్​ హసీనా ధన్యవాదాలు తెలిపారు.

PM Modi in Bangladesh, Modi visit in Bangladesh
ప్రధాని మోదీ

By

Published : Mar 26, 2021, 6:43 PM IST

Updated : Mar 26, 2021, 8:20 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లా​ జాతిపిత షేక్​ ముజ్బుర్​ రహ్మాన్​కు ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన కుమార్తె షేక్​ రెహ్నాకు ప్రధాని నరేంద్ర మోదీ అందించారు. దివంగత నేతను ఈ పురస్కారంతో గౌరవించడం భారతీయులు గర్వించదగ్గ విషయమని ప్రధాని పేర్కొన్నారు. బంగ్లాదేశ్​ జాతీయ వేడుకల్లో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
గాంధీ శాంతి పురస్కారం అందిస్తున్న ప్రధాని

"బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య పోరాటంలో వారికి అండగా నిలిచిన భారత​ సైన్యానికి నా వందనాలు. లిబరేషన్​ వార్​లో పాల్గొన్న చాలా మంది భారతీయ సైనికులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. లిబరేషన్​ వార్​ నుంచి ఇరుదేశాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. నేను కూడా బంగ్లాదేశ్​ స్వాతంత్ర్యోద్యమంలో భాగమైనందుకు గర్వపడుతున్నాను. నాకు అప్పుడు 20-22 ఏళ్లు ఉంటాయి.. నేను నా సహచరులతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నాను. అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. వ్యాపార రంగంలో ఇరు దేశాలకు సమాన అవకాశాలు ఉన్నాయి. అదే స్థాయిలో తీవ్రవాదం వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాలి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మోదీకి ధన్యవాదాలు..

బంగ్లాదేశ్​ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఆ దేశ ప్రధాని షేక్​ హసీనా.

"కరోనా మహమ్మారి సమయంలోనూ మా ఆహ్వానాన్ని మన్నించి బంగ్లేదేశ్​కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. అభివృద్ధికి సంబంధించి భారత్​ ఇప్పుడు ఓ గొప్ప భాగస్వామిగా మారింది. బంగ్లాదేశ్​ స్వాతంత్ర్యంలో భారత్​ పోషించిన పాత్రను మేము మర్చిపోము. షేక్​ ముజ్బుర్​ రహ్మాన్​ను గాంధీ శాంతి పురస్కారంతో గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు. అన్ని వేళలా భారత్​ బంగ్లాదేశ్​కు తోడుగా నిలుస్తోంది. ఈ సారి 109 అంబులెన్సులను అందించింది. 1975 ఆగస్టు 15 ఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ దేశ జాతపితతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నా కుటుంబం కూడా ఉంది."

-షేక్​ హసీనా, బంగ్లాదేశ్​ ప్రధాని

భారత్​ బంగ్లాదేశ్​ల మధ్య బంధం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 మంది వ్యాపారవేత్తలను భారత్​కు ఆహ్వానించారు ప్రధాని షేక్​ హసీనా. అక్కడి అంకురాల్లో భాగం కావాలని, పెట్టుబడిదారులతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్​ యువతకు స్వర్ణ జయంతి స్కాలర్​షిప్​ను ప్రకటించారు. భారత్​ ఉత్పత్తి చేసిన కొవిడ్​ టీకాలను బంగ్లాదేశ్​ ప్రజలు వినియోగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అమరులకు నివాళి..

అంతకుముందు ఢాకాలోని జాతీయ అమరవీరుల కేంద్రాన్ని సందర్శించి 1971 బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య యుద్ధంలో అమరులైన వారికి ప్రధాని అంజలి ఘటించారు. అక్కడ మొక్క నాటి అమరులకు నివాళిగా కొద్ది సేపు మౌనం పాటించారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశం లిఖించారు.

అమరులకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ

బంగ్లాదేశ్‌లోని బొహ్రా సామాజిక వర్గం వారితో సమావేశం అనంతరం ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మొమెన్​తో మోదీ చర్చలు జరిపారు. బంగ్లాదేశ్​లోని అఖిల పక్ష నేతలతో భేటీ అయ్యి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

ఇదీ చదవండి :'మయన్మార్ నిరసనల్లో 320 మంది మృతి'

Last Updated : Mar 26, 2021, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details