కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రయాణ పరిమితులను తొలగించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్‌తో వీడియో కాల్లో మాట్లాడిన ఇమ్రాన్.. ఈ మేరకు అభ్యర్థించారు.
"కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. ఇప్పటికే కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఈ నిర్ణయంతో మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ జోక్యం చేసుకుని ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలి. ప్రయాణాలకు సంబంధించి వివక్ష లేని నిబంధనలను రూపొందించాలి."
- ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని