తెలంగాణ

telangana

ETV Bharat / international

'రష్యా విమాన ప్రమాదానికి కారణాలివే!'

రష్యాలోని మాస్కోలో జరిగిన విమాన ప్రమాదానికి గల కారణాలను పైలట్​ వివరించారు. ఆకాశంలో మెరుపుల కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చిందని తెలిపారు. మాస్కో ఎయిర్​పోర్టులో రన్​వేపై దిగుతున్న సమయంలో విమానంలో మంటలు చెలరేగడం వల్ల 41మంది ప్రమాణికులు మృతి చెందారు.

రష్యా విమాన ప్రమాదం

By

Published : May 7, 2019, 5:54 AM IST

Updated : May 7, 2019, 6:09 AM IST

రష్యాలోని మాస్కో ఎయిర్​పోర్టులో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తును ముమ్మరం చేసింది ఆ దేశ ప్రభుత్వం. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు ఆ విమాన పైలట్​ డెనిస్​ ఎవ్​డోకిమోవ్​. విమానాన్ని అత్యవసరంగా ఎందుకు దించాల్సి వచ్చిందో తెలిపారు. ఆకాశంలో మెరుపులు రావడం వల్లే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ద్వారా అనుసంధానాన్ని పునరుద్ధించామని, కానీ తక్కువ సమయంలోనే సంబంధాలు తెగిపోయాయని చెప్పారు పైలట్​.

ల్యాండింగ్​ సమయంలో మంటలకు కారణం విమానంలో ఇంధనం ట్యాంకులు పూర్తిగా నిండి ఉండడమేనని అనుకుంటున్నానని చెప్పారు.

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఆదివారం సుఖోయ్​ సూపర్​జెట్​-100 విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయింది. రన్​వేపైకి దిగగానే ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 78 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇదీ చూడండి :రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి

Last Updated : May 7, 2019, 6:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details