ఫిలిప్పీన్స్లో 'వామ్కో' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ విధ్వంసానికి ఇప్పటివరకు 53 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. తుపాను ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడగా.. సుమారు 22మంది గల్లంతయ్యారని వెల్లడించింది. వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
కాగాయన్, ఇసాబెలా రాష్ట్రాల్లో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాయుసేన రంగంలోకి దిగి.. రక్షణ చర్యలు చేపట్టింది.