మొలావే తుపాను బీభత్సానికి ఫిలిప్పీన్స్ చిగురుటాకులా వణికిపోయింది. సుమారు 13 మంది గల్లంతయ్యారు. అందులో 12మంది మత్స్య కారులు ఉన్నారు. వేల మందిని విపత్తు నిర్వాహక బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఫిలిప్పీన్స్లో తుపాను బీభత్సం -13మంది గల్లంతు - philippines typhoon latest news
ఫిలిప్పీన్స్లో మొలావే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 13మంది గల్లంతయ్యారు. దాదాపు 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరో 20వేల మందిని విద్యాలయాల్లో , ప్రభుత్వ భవనాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించామని రక్షణ అధికారి తెలిపారు.
ఫిలిప్పీన్స్లో తుపాను బీభత్సం -13మంది గల్లంతు
తుపాను దక్షిణ చైనా సముద్రం మీదుగా గంటకు 125కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. తుపాను ధాటికి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరం అతలాకుతలం అయ్యింది.
భారీ తుపానుతో ఓరియంటర్ మిండోరో రాష్ట్రంలో పంటలు ధ్వంసం అయ్యాయని ఆ రాష్ట్ర గవర్నర్ హూమర్లిటో డాలర్ తెలిపారు. చెట్లు నేలకొరిగి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. రోడ్లపైన పడిన చెట్లను, చెత్తను తొలగిస్తున్నట్లు వివరించారు.