తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిలిప్పీన్స్ తుపాను విలయంలో 208కు చేరిన మృతులు - ఫిలిప్పీన్స్ తుపాను

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​లో సంభవించిన తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రకృతి విపత్తుకు 208 మరణించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

Philippines Death toll
Philippines Death toll

By

Published : Dec 20, 2021, 7:31 AM IST

Updated : Dec 20, 2021, 7:37 AM IST

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​ను అతలాకుతలం చేసిన భీకర తుపాను 'రాయ్' ధాటికి మరణించిన వారి సంఖ్య 208కి చేరింది. ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది.

తుపాను విధ్వంస దృశ్యాలు

తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

తుపాను ధాటికి విరిగిపడ్డ చెట్లు

ఇదీ చదవండి:ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం- 112కు చేరిన మృతులు

Last Updated : Dec 20, 2021, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details