ఫిలిప్పీన్స్ పరాక్లో ఓ శిథిల భవనంలో చిక్కుకున్న బాధితుడిని విపత్తు నిర్వహణ సిబ్బంది సురక్షితంగా వెలికితీశారు. సోమవారం భూకంపం ధాటికి అతడు ఉన్న 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని, అప్పటి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి... అనేక గంటల తర్వాత విముక్తి లభించింది.
శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు... - విపత్తు నిర్వహణ
ఫిలిప్పీన్స్లో భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవనంలో చిక్కుకున్న బాధితుడిని విపత్తు నిర్వహణ సిబ్బంది అనేక గంటల తర్వాత రక్షించారు.
శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు...
ఫిలిప్పీన్స్లో సంభవించిన భూకంపం ధాటికి రాజధాని మనీలా సహా పలు నగరాలు వణికిపోయాయి.6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో పలు భవనాలు కూలిపోయాయి. ముగ్గురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: అరెస్టుకు ముందే దేశ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య