తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2021, 12:12 PM IST

ETV Bharat / international

సైనిక విమాన ప్రమాదంలో 50కి చేరిన మృతులు

ఫిలిప్పీన్స్​లో జరిగిన సైనిక విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరింది. 49 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సిబ్బంది సహా మొత్తం 96 మందితో వెళ్తున్న సైనిక విమానం సీ-130 సులు ప్రావిన్స్​లోని పర్వత ప్రాంత పట్టణం.. పాటికుల్ సమీపంలో కూలింది.

Philippine military's worst air disaster
కూలిన సైనిక విమానం

ఫిలిప్పీన్స్​లో సైనిక విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 96 మంది ఉన్నారు. వీరిలో 49 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఘటనా స్థలిలో సైనికులు

సైనిక విమానం సీ-130 సులు ప్రావిన్స్​లోని పర్వత ప్రాంత పట్టణం, పాటికుల్ సమీపంలో కూలింది. విమానం కూలిన సమయంలో.. కింద ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్ వేను తప్పిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ గాల్లోకి ఎగిరేందుకు పైలట్ ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.

ఎగిసిపడుతున్న మంటలు

ప్రమాద సమయంలో.. విమానంలో ముగ్గురు ఫైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది, 88 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాగయాన్ డి ఓరో నగరం నుంచి సైనిక దళాలను వేరే ప్రాంతానికి తరలిస్తుండగా, ప్రమాదం జరిగిందని వివరించారు.

ఘటనా స్థలిలో విమాన శకలాలు

సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్‌ ఫోర్స్‌లో భాగంగా బలగాలను అక్కడ మోహరించేందుకు పంపినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:బోటు మునిగి 43 మంది మృతి!

గోల్ఫ్​ కోర్టులో కాల్పులు- ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details