ఫిలిప్పీన్స్‌లో సైనిక విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 96 మంది ఉన్నారు. వీరిలో 49 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగతా జవాన్ల కోసం ముమ్మరంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.
రన్‌వే తప్పిపోయి..
96 మందితో వెళ్తున్న సైనిక విమానం సీ-130 సులు ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంత పట్టణం, పాటికుల్ సమీపంలో కూలింది. విమానం కూలిన సమయంలో.. కింద ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్ వేను తప్పిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ గాల్లోకి ఎగిరేందుకు పైలట్ ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.