తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు! - corona in Philippine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను ఇటీవల కలిసిన చట్టసభ్యుల్లో కరోనా సోకినవారూ ఉన్నారని తేలడం కలకలం రేపింది. ట్రంప్​కు వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని శ్వేతసౌధం నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితే మరో దేశాధినేతకు ఎదురైంది. ఎవరాయన?

Philippine leader to undergo 'precautionary' virus test
ట్రంప్​తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!

By

Published : Mar 12, 2020, 4:57 PM IST

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.. ​ కరోనా వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేయించుకోనున్నారు.

ఇందుకే..

ఇటీవల ఫిలిప్పీన్స్​లో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాలకు హాజరైన కొందరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ఆ కార్యక్రమం జరిగిన సెనేట్​ భవనం సహా ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంక్​ భవనాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. అనేక మంది అధికారులు స్వచ్ఛందా నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ అధికారులు, సెనేటర్లను నిత్యం కలిసే అధ్యక్షుడు డ్యూటెర్టే సైతం ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకువచ్చారు. వృద్ధుల్లో వైరస్​ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. 74 ఏళ్ల డ్యూటెర్టే పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని భావిస్తున్నారు.

ఫిలిప్పీన్స్​లో ఇప్పటివరకు 49 మందికి కరోనా సోకింది. వైరస్​ బారినపడి ఇద్దరు మృతి చెందారు.

ఇదీ చదవండి:కమల్​నాథ్​ సర్కార్​ భవితవ్యం తేలేది ఆరోజే...

ABOUT THE AUTHOR

...view details